తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీనరేష్ (40) ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది, ఆదివారం ఇంట్లోని గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెనాలి పోలీసులు తెలిపారు. అతనికి భార్య ఇద్దరు పిల్లలుఉన్నారు.