ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ భూములను అడ్డుగోలుగా దోచుకొంటున్నాయి: జీవీఎల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 11, 2022, 11:17 PM

విశాఖపట్నం భూములను రాజకీయ పార్టీలు అడ్డగోలుగా దోచుకున్నాయని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. జీవీఎల్ నరసింహారావు ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ భూముల అంశంపై వైసీపీ నుంచి సంతృప్తికర సమాధానం రావటం లేదన్నారు. సామాన్యుడికి న్యాయం జరగకుండా సంపన్నులకు న్యాయం చేసేలా చేస్తున్నారని మండిపడ్డారు. జీవీఎల్ ఎవరని మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారని.. ఇదే అమర్నాథ్ గతంలో ఈ అంశంపై సీబీఐ విచారణ కావాలని అడిగింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు.


విశాఖపట్నం భూములను రాజకీయ పార్టీలు అడ్డగోలుగా దోచుకున్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. వీళ్ల భూదోపిడీల వల్ల 42 వేల కుటుంబాలు టెన్షన్ పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండు పార్టీలు ప్రజల కళ్లు గప్పే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. విశాఖ భూములపై గతంలో సిట్‌తో విచారణ జరిపారని.. ఇప్పటి వరకు రిపోర్టు రాలేదని లేఖలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు గుర్తు చేశారు. ఈ అంశంపై రెండు సార్లు సిట్ విచారణ జరిగినా రిపోర్టులను తొక్కి పెట్టారని ఆరోపించారు. గవర్నర్ జోక్యం చేసుకుని సిట్ రిపోర్టును బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సామాన్యులను సెక్షన్ 22 ఏలో పెట్టి వేధిస్తున్నారని.. వైసీపీ ప్రజాద్రోహ చర్యలు చేస్తోందని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com