కొరిసపాడు మండలం, మేదరమెట్ల గ్రామంలోని సోమవరప్పాడు కాలనీ, అక్రమ మద్యం విక్రయానికి అడ్డాగా మారింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి నిత్యం అర్థరాత్రి సమయంలో, పదుల సంఖ్యలో మందుబాబులు వాహనాల్లో కాలనీలో అరుపులు, కేకలతో తిరుగుతుండడంతో, కాలనీ పెద్దలు మరియు మహిళలు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు, మేజర్ పంచాయతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంత జరుగుతున్నా పోలీసువారికి తెలియకపోవడం గమనార్హం. తక్షణమే పోలీసు వారు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa