రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వల్ల పేద ప్రజల జీవితాల్లో కాంతులు వెల్లువిరుస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బుధవారం తెర్లాం మండలం వెలగవలస సచివాలయ పరిధిలో గల డి. గధబవలస గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే శంబంగి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ముందుగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే శంబంగికి స్థానిక నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రతి గడప వద్దకూ వెళ్లి ప్రభుత్వం ముద్రించిన బుక్లెట్ను లబ్ధిదారులకు అందజేసి మూడేళ్లలో వారికి అందించిన పథకాలను వివరించారు. కులం, మతం, పార్టీలు ఏవి చూడకుండా పారదర్శకతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు చేర్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీనేనని పేర్కొన్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేవు ఓట్లడిగేందుకు తాము రాలేదు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ప్రజలుకు ఇంకా ఎం సమస్యలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు మాత్రమే వచ్చామన్నారు.
టీడీపీ హయాంలో అప్పటి పాలకులు ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించేవారని, వారికి తమ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలన్నారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వాన్నే ప్రజల వద్దకు పంపిన ఏకైక ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు శంబంగి వేణుగోపాలనాయుడు, ఎంపీపీ నర్సుపల్లి ఉమాలక్ష్మీ, జడ్పీటీసీ గర్బాపు లుర్దు, వైస్ ఎంపీపీ చెపేన సత్యనారాయణ, సర్పంచ్ జావాన రమేష్, ఎంపీటీసీ బేవర గిరి, వి. ఆదినారాయణ, బాడంగి జడ్పిటిసి సభ్యుడు పెద్దింటి రామారావు, ఎంపీడీఓ శంబంగి రామకృష్ణ, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు వైసీపీనాయకులు, కార్యకర్తలు ప్రభుత్వఅధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.