మెంటాడ మండలం లోని జగన్నాధపురం పంచాయతీ ఆనుకొని ఉన్న చంపావతి నది గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆయా గ్రామాల ప్రజలు నిత్యవసరాలకు వెళ్లలేని దుస్థితి ఏర్పడినది. ప్రజలు ఆసుపత్రికైనా, స్కూలుకైనా, కాలేజీ కైనా ఎటువంటి కష్టసుఖాలకైన ఈ చంపావతి నది తీరం దాటి వెళ్ళాలి. అయితే మాజీ సర్పంచ్ పలికిల అచ్చుము నాయుడు ఎంపీపీ కు జగన్నాధపురం పంచాయతీ ప్రజలు కష్టాలను వివరించారు। గత రెండు సంవత్సరాల క్రితం 1గుడిసి దయ. 2. జెర్రీ సింహాచలం గర్భిణీలు అనారోగ్యంతో మృతి చెందారు. ఆ మృతదేహాలను గ్రామానికి తీసుకు రావాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.