కొత్తపట్నం: తల్లి ఏసీబీకి పట్టుబడిందనే మనస్థాపంతో కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కొత్తపట్నంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే తాళ్లూరు మండలం లక్కవరం పంచాయతీ కార్యదర్శి సుజాత లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్ చదువుతున్న ఆమె చిన్న కుమార్తె మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో కొత్తపట్నం సముద్రతీరానికి చేరుకొని సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మత్స్యకారులు చూసి ఆమెను రక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa