రణస్థలం: వారం రోజులకు పైగా కురిసిన వర్షాలతో పంటలను కాపాడుకునేందుకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించటం ఎంతో అవసరమని వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు డాక్టర్ జి చిట్టిబాబు, డాక్టర్ శ్రీనివాస్ రైతులకు అవగాహన కలిగించారు. రణస్థలం మండలం సంచాం , నెలివాడ, పతివాడపాలెం గ్రామాల్లో సాగవుతున్న పత్తి పంటలను వారు పరిశీలించారు. పత్తి పంటకు కాయ కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉందని, పొలంలో నీరు బయటకు పూర్తిగా తీసి వేయాలని అన్నారు.