తమిళనాడులో దారుణం జరిగింది. ఆదంబాక్కానికి చెందిన మాణిక్కం కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అతనికి డిగ్రీ చదువుతున్న కూతురు సత్య ఉంది. అదే ప్రాంతానికి చెందిన సతీష్ సత్యను ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. గురువారం కాలేజీకి రైలులో వెళ్తున్న సత్యను రైలు నుంచి సతీష్ కిందికి తోసేశాడు. దీంతో సత్య మరణించింది. సత్య మృతి తట్టుకోలేక మాణిక్కం శుక్రవారం ఉదయం మరణించాడు. ఈ ఘటనతో విషాద చాయలు అలుముకున్నాయి.