మేయర్ డా. శిరీష అధ్యక్షతన శుక్రవారం జరిగిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో కౌన్సిల్ సభ్యులు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 29 కోట్ల 19 లక్షల 70 వేల రూ. లతో తిరుపతిలో చేపట్టనున్న 38 రకాల పనులకు సంబంధించి, మాస్టర్ ప్లాన్ రోడ్లు, అండర్ బ్రిడ్జ్ లెవెల్ క్రాసింగ్, కాలువల నిర్మాణంపై చర్చించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో కమీషనర్ అనుపమ అంజలి ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.