తండ్రి మందలించాడని మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. యడ్లపాడు మండలం దింతెనపాడుకి చెందిన లీలా కిరణ్మయి(20) నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. కిరణ్మయిని ఇంటి పనులు సక్రమంగా చేయడం లేదని తండ్రి రాజేష్ మందలించాడు మనస్థాపానికి గురైన కిరణ్మయి చెదల మందు తిన్నది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.