విజయవాడలో అత్యాచారానికి గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం పై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం ఆరాతీశారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ తో ఆమె మాట్లాడి బాలిక ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇదే కేసుకు సంబంధించి విజయవాడ సీపీతోనూ వాసిరెడ్డి పద్మ మాట్లాడి. నిందితుల అరెస్టు వివరాలను అడిగారు.