విశాఖపట్నం: జి. మాడుగుల మండలంలోని గిడుతురు పంచాయతీ నెట్టమామిడి గ్రామానికి చెందిన కొర్రా. రాధ అనే నిండు గర్భిణికి గురువారం పురిటి నొప్పులు వచ్చాయి. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు సహకారంతో గర్భిణిని డోలీ మోతతో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో దట్టమైన అటవీ ప్రాంతంలో గర్భిణీ రాధకు నొప్పులు అధికం కావడంతో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి బిడ్డను పాడేరు లోని ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa