దసపల్లా, ఋషి కొండ, విశాఖ ప్రభుత్వభూములు కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖ జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ముఖ్యఅతిథిగా సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్మి వి. వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ భూములు కళ్ళ ముందే కబ్జా చేస్తుంటే నాకే పట్టనట్టు జగన్ ప్రభుత్వం చూస్తుందంటే దాని ఆర్ధమేమటి అన్నారు. ప్రత్యేక హోదలేదు రైల్వే జోన్ లేదు, మూడు రాజధానుల ముద్దుకు తేచ్చి ఉత్త రాంధ్ర అభివృద్ధి పరిచారన్నారు.
రైల్వే జోన్ లేదు ప్రత్యేకహోదాలేదు, విభజన హామిలు తుంగలో తోక్కారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరంచేయాడాని పూనుకొంటుంది దానిపై జగన్ మాట్లాడం లేదు. మూడు రాజధానులతో ఉత్తరాంధ్ర ప్రజల్లో ప్రాంతీయ విబేదాలు తీసుకోస్తున్నారన్నారు. భూ కబ్జాదారులను కఠినంగా శిక్షించాలి, సిట్ నివేదిక బయటపెట్టాలని అన్నారు.
ఈ ధర్నాలో సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యులు కె. లోకనాధం, విశాఖజిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు, జిల్లా కార్యవర్గసభ్యులు ఆర్ కె ఎస్వీ కుమార్, కె. ఎం. శ్రీనివాసరావు, జగన్ బి. ఈశ్వరమ్మ, సీపీఎం 78వవార్డు కార్పోరేటర్ డాక్టర్ బి. గంగారావు, ఈ ధర్నాకి జిల్లా కార్యవర్గ సభ్యురాలు బి. పద్మ అధ్యక్షతన జరిగింది.