మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో బీజేపీ నేత శైలేంద్ర బదౌరియా చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ నర్వారియా బ్యానర్‌పై బదౌరియా మూత్ర విసర్జన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బదౌరియాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి 6 ఏళ్ల పాటు బీజేపీ బహిష్కరించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భగవాన్‌దాస్ సబ్నానీ మాట్లాడుతూ, ఈ చర్య అత్యంత అసభ్యకరమన్నారు. దీనిని పార్టీ ఎప్పటికీ సహించదని అన్నారు.