తన ఉద్యోగులకు కేంద్రం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకొని దీపావళి కానుక అందించింది. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా 15 శాతం డీఏను పెంచింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుపై ఉత్తర్వులు జారీ చేసింది. తాజా డీఏ పెంపును జులై నెల నుంచే అమలు చేయనున్నట్లుగా కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతూ ఎన్డీఏ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న రోజుల వ్యవధిలోనే మరోమారు డబుల్ డిజిట్‌తో కూడిన డీఏ పెంపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.