ఓ కేసు విషయంలో రాజస్థాన్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాలికపై అత్యాచారం కేసులో రాహుల్ (25) అనే వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే తాను తల్లిని కావాలని, అందుకు తన భర్తకు పెరోల్ ఇవ్వాలని రాహుల్ భార్య కోర్టుకు వెళ్లింది. ఆమె పిటిషన్‌ను జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ సమీర్ జైన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. భార్యను గర్భవతిని చేసేందుకు రాహుల్‌కు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.