వైయస్ జగన్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు వైయస్‌ఆర్ రైతు భరోసా పథకం ద్వారా తోడుగా నిలుస్తోంది. వరుసగా నాలుగో ఏడాది రెండో విడతగా వైయస్‌ఆర్ రైతు భరోసా సాయం నేడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో సీఎం వైయస్ జగన్ జమ చేయనున్నారు. 50.92 లక్షల మంది రైతన్నల బ్యాంక్ ఖాతాల్లో నేడు రూ.2,096.04 కోట్లు జమ కానున్నాయి. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన వేదిక పై నుంచి సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు.