టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్ ఆడింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి టీమిండియా విజయం సాధించింది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో రోహిత్ సేన అన్ని ఏరియాల్లో ఆధిపత్యం ప్రదర్శించి 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఆరు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో ఆస్ట్రేలియా పరాజయాన్ని చవి చూడటం ఒక ఎత్తయితే.. నాలుగు వికెట్లను కోల్పోవడం మరో ఎత్తు. మహ్మద్ షమీ విసిరిన తొలి రెండు బంతులకు నాలుగు పరుగులొచ్చాయి. నాలుగు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సిన దశలో వరుసగా వికెట్లు పడ్డాయి. నాలుగు బంతులకు నలుగురు బ్యాటర్లు అవుట్ అయ్యారు. టీ20 ఫార్మట్ క్రికెట్‌లో ఇదో అద్భుతమే. మూడో బంతికి పాట్ కమ్మిన్స్ అవుట్ అయ్యాడు. ఒంటి చేత్తో కోహ్లీ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. నాలుగో బంతికి అష్టన్ అగర్ రనౌట్ అయ్యాడు. అయిదు, ఆరు బంతులకు వరుసగా ఇంగ్లిస్, కేన్ రిచర్డ్‌సన్‌లను బలితీసుకున్నాడు షమీ. చివరి ఆరు వికెట్లను తొమ్మిది పరుగుల తేడాతో కోల్పోయింది ఆసీస్. ఆస్ట్రేలియా మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఏ స్థాయిలో ఒత్తిడికి గురయ్యారనేది ఈ ఓవర్‌తో తేలిపోయింది.
What a over by #Shami India won
#KingKohli#SuryakumarYadav#INDvAUS#KLRahul #viratkholi #RohitSharma#Halal_Free_Diwali#PMKisan pic.twitter.com/PwOsJDWKcf
— vinay pandey (@vinay6840) October 17, 2022