దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. భవానీ దీక్షాపరులు గత రెండేళ్లలో పోల్చుకుంటే ఎక్కువ మంది వచ్చారన్నారు. ఈ ఏడాది దసరాకు రూ.16 కోట్ల ఆదాయం వచ్చిందని... అలాగే దసరాకు రూ.10.5 కోట్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. ఈనెల 25న 11 గంటలకు సూర్యగ్రహణ కారణంగా ఆలయాన్ని మూసివేస్తున్నామని తెలిపారు. 26న మహా నివేదన, హారతి అనంతరం ఆలయాన్ని తెరువనున్నట్లు ఈవో వెల్లడించారు. వచ్చే నేల 4 నుంచి 8 వరకు భవానీ దీక్షలు ప్రారంభం అవుతాయని... 7న ఇంద్ర కీలాద్రిపై కోటి దీపోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. 8న చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తామన్నారు. 24న అర్థ మండల దీక్షలు ప్రారంభం అవుతాయని చెప్పారు. 7 కలశజ్యోతుల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు భవానీ దీక్షా విరమణలు ఉంటాయని ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు.