తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణ రహస్యం పై వేసిన అర్ముగస్వామి కమిటి రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ రిపోర్టులో ఏమున్నదంటే..” జయలలిత చావుకు పరోక్షంగా శశికళ కారణం. ఆస్పత్రిలో చేరే నాటికే జయలలితకు, శశికళకు విబేధాలున్నాయి. అపోలోవైద్యుల తీరు కూడా తప్పుగానే ఉంది. యాంజియోప్లాస్టి చేయాలని నిపుణులు సూచించినా అందుకు తగ్గ చర్యలు చేపట్టలేదు. అప్పటి తమిళనాడు సీఎస్ కూడా ఈ నేరంలో భాగస్తుడే. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేదు. జయలలిత పరిస్థితికి తగ్గ చికిత్స అందించలేదు. ఇంకా విచారణ చేసి దోషులను శిక్షించాలి.” అని కమిటి తేల్చింది.