చాలా మంది చిన్న చిన్న విషయాలకే ఎదుటి వారితో గొడవకు దిగుతుంటారు. మాటలతో సరిపెట్టకుండా బహిరంగంగా కొట్టుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటన న్యూయార్క్ గ్రాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఎస్కలేటర్ మీద ఇద్దరు ప్రయాణికులు గొడవ పడ్డారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చివరికి దొర్లుకుంటూ కిందికి పడిపోతున్నా, కొట్లాట ఆపలేదు. ఈ వీడియో రెడ్డిట్లో పోస్ట్ అయింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ ఇద్దరి తీరును తప్పుబడుతున్నారు.