ఒడిశాలోని కటక్‌లో అమానుష ఘటన జరిగింది. ఆరుగురు వ్యక్తులు ఓ యువకుడిని తాళ్లతో బైక్ కట్టేశారు. అలా అతడిని 3 కి.మీ పరిగెత్తించారు. అప్పు చెల్లించనందుకు ఆ యువకుడిని ఇలా వేధించారు. బాధితుడు కొన్ని రోజుల కిందట వారి వద్ద అప్పు తీసుకున్నాడు. ఎన్ని సార్లు అడిగినా ఇవ్వకపోవడంతో అప్పు ఇచ్చిన వ్యక్తి, మరో ఐదుగురు కలిసి ఆదివారం రాత్రి ఆ యువకుడిని ఇలా హింసించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను గుర్తించామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.