రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 6 పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో రబీ పంటలకు మద్దతు ధర పెంచాలని నిర్ణయించారు. గోదుమలకు క్వింటాలుకు రూ.110, ఆవాలు క్విటాలుకు రూ.400, మసూర్ పప్పుకు రూ.500, బార్లీ రూ.100, శనగలు రూ.150, సన్ ఫ్లవర్ రూ.209 పెంచింది.