బీజేపీతో సంబంధాలను కట్ చేసుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారని తెలుస్తోంది. జనసేన కార్యాలయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..”నేటి నుంచి రాష్ట్ర ముఖచిత్రం మారబోతుంది. ప్రధాని మోడీ, బీజేపీ అంటే నాకు గౌరవమే. కానీ రోడ్ మ్యాప్ అడిగితే ఇంత వరకు స్పందన లేదు. బీజేపీని రోడ్ మ్యాప్ అడగడమేంటన్న విమర్శలు వచ్చాయి. బీజేపీతో పొత్తుఉన్నా ఎందుకో కలిసి వెళ్లలేకపోతున్నాం. మేం బీజేపీకి ఊడిగం చేయం.” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.