గోవా, తెలంగాణ, రాష్ట్రాలకు చెందిన అక్రమ మద్యం ను SEB మరియు తుళ్ళూరు రెవెన్యూ అధికారులు సమక్షంలో ధ్వంసం చేసిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్. జిల్లాలో చట్టవ్యతిరేకంగా అక్రమ మద్యం కేసుల్లో సీజ్ చేసిన తుళ్లూరు సబ్ డివిజన్ పరిధిలో నమోదు అయిన 68 కేసు లలో, 11,963 వివిధ రకాల సుమారు 5,76,670/- లక్షల విలువ చేసే పొరుగు రాష్ట్రాల మద్యం బాటిల్స్ ను SEB అధికారులు, రెవెన్యూ అధికారులు సమక్షంలో జిల్లా ఎస్పీ గారూ సబ్ ధ్వంసం చేశారు. చట్టవ్యతిరేకమైన అక్రమ మద్యం మరియు ఇతర కార్యకలాపాలలో పాల్గొన్నా, పాల్గొనే వారికి సహకరించినా,అట్టి కార్యకలాపాల్లో ఏ విధమైన పాత్ర పోషించిన చట్ట పరంగా కేసులు నమోదు చేసి,కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపిఎస్ గారు తో పాటు SEB addl SP మహేష్ గారు, తుళ్ళూరు సబ్ డివిజన్ డి ఎస్ పి శ్రీ పోతురాజు గారు , ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.