మంగళగిరి నగరంలోని లక్ష్మీనరసింహ స్వామి కాలనీ నందు తుది దశకు చేరుకున్న డాక్టర్ వైయస్సార్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణాన్ని ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ హనుమంతరావులు గురువారం పరిశీలించారు. నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్, కార్పొరేషన్ అధికారులకు ఎమ్మెల్యే ఆర్కే పలు సూచనలు చేశారు. దీపావళి పండుగ తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లను ప్రారంభించుకోవడానికి ఏర్పాట్లు చేయాలని కార్పొరేషన్ అధికారులకు సూచనలు చేశారు.