‘తెలుగు సూర్యుడు’ సి. పి. బ్రౌన్ స్మారకంగా గ్రంథాలయాన్ని నిర్మించి బ్రౌన్‌కు తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం కల్పించిన మహోన్నతవ్యక్తి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి అని యోగివేమన విశ్వవిద్యాలయం కులసచివులు ఆచార్య ఆచార్య దుర్భాక విజయరాఘవ ప్రసాద్ పేర్కొన్నారు. సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో గురువారం ఉదయం సి. పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపకులు జానమద్ది హనుమచ్ఛాస్త్రి 98వ జయంతి నిర్వహించారు.
సి. పి. బ్రౌన్ భాషా పరిశోధనకేంద్రం బాధ్యులు డా॥ మూల మల్లికార్జున రెడ్డి, పరిశోధనకేంద్రం సహాయ పరిశోధకుడు డా. చింతకుంట శివారెడ్డి, గ్రంథపాలకులు ఎన్. రమేశ్‌రావు, జి. హరిభూషణ్ రావు, డా. వెల్లాల వెంకటేశ్వరాచారి లు ప్రసంగించారు. పరిశోధన కేంద్రం సిబ్బంది జూనియర్ అసిస్టెంట్లు ఆర్. వెంకటరమణ, మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.