టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక కీలక విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌పై 16 పరుగుల తేడాతో విజయం సాధించి మెయిన్ లీగ్‌కు అర్హత సాధించింది. తొలి రౌండ్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో నమీబియా చేతిలో ఓడిన శ్రీలంక తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో గెలవాల్సి వచ్చింది. యూఏఈతో జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించిన శ్రీలంక మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై 16 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. ఆసియా కప్ ఛాంపియన్ శ్రీలంక తన తొలి గేమ్‌లో యుఎఇపై అద్భుతమైన విజయంతో నమీబియాతో జరిగిన షాక్ ఓటమి నుండి పుంజుకుంది. తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై మంచి ప్రదర్శనతో సూపర్-12లోకి ప్రవేశించారు. ఇది కూడా చదవండి - ఈరోజు న్యూజిలాండ్‌తో భారత్ తలపడనున్న శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసిన తర్వాత 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. శ్రీలంక తరఫున కుశాల్ మెండిస్ 79 పరుగులు చేశాడు. అసలంక 31 పరుగులతో పర్వాలేదనిపించినా.. మిగతా వారు పెద్దగా ప్రభావం చూపలేదు. ఛేడాన్‌లో నెదర్లాండ్స్ 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ తరఫున మాక్స్ ఓడౌడ్ 71 పరుగులు చేశాడు. చివర్లో వికెట్లు పతనం..మాక్స్‌కు ఎలాంటి సహకారం అందకపోవడంతో నెదర్లాండ్స్‌కు ఓటమి తప్పలేదు.