స్వచ్ఛభారత్ 2. 0లో భాగంగా కేంద్ర ప్రభుత్వ యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం గురువారం బ్రహ్మంగారి మఠం టౌన్ లోని శ్రీ వేంకటేశ్వర జూనియర్, డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ యస్ కే. వలి, మేనేజింగ్ డైరెక్టర్ మాధవరెడ్డి, ప్రిన్సిపల్ ముని రెడ్డి అధ్వర్యంలో కళాశాలలోని యన్. యస్. యస్ యూనిట్ అధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ జరిగింది.
ఈ సందర్భంగా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ముండ్లపాటి చంద్రశేఖర్ పర్యావరణానికి, మానవ సమాజానికి ప్లాస్టిక్ వ్యర్ధాల ద్వారా కలిగే నష్టాలను వివరించారు. తత్పలితంగా వాటి వాడకంలో మనం తీసుకోవాల్సిన మెలకువలను వివరించారు. ప్లాస్టిక్ వ్యర్ధాల సేకరణ మరియు నిర్మూలన యొక్క ఆవశ్యకతను గురించి తెలియజేశారు. అంతరం విద్యార్థులు సేకరించిన ప్లాస్టిక్ తూకం వేయగా 30 కేజీలు ఉన్నవి. ఈ కార్యక్రమంలో వీర నారాయణ, ఆర్ట్స్ సొసైటీ సభ్యులు రవి, కళాశాల సిబ్బంది హరి, బాల సుబ్బయ్య, శారద, జగన్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు