రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 65 ప్రకారం అన్ని చర్యలు చేపడతామని జాయింట్ కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం ఎన్విరాన్మెంటల్ అటవీ సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించి కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో బ్యానర్లు తయారుచేసి సంస్థలను గుర్తించి వారికి అవగాహన కల్పించి 31వ తేదీ లోపల వారి వద్ద ఉన్న మెటీరియల్ మొత్తం ముగిసేలా చూడాలని లేదంటే సీజ్ చేయాలని అన్నారు.
అదేవిధంగా నిర్ణయించిన మేరకు ప్లాస్టిక్ కవర్లను కూడా అనుమతించకూడదని అన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో బ్యానర్లు తయారు చేసే పరిశ్రమలను 32 గుర్తించడం జరిగిందని, ఇప్పటికే వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని అదేవిధంగా మండల స్థాయిలో దుకాణాలలో కూడా కొంతమందికి అవగాహన కూడా కల్పించామని మరో రెండు మూడు రోజుల్లో జిల్లా స్థాయిలో మరియు మండలం గ్రామీణ స్థాయిలో కూడా అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.