తాడిపత్రి: మండల పరిధిలోని బందార్ల పల్లె, బాపనపల్లి, తిమ్మేపల్లి గ్రామాల్లో గురువారం జిల్లా శాస్త్రవేత్తలు పర్యటించారు. అకిర నకిలీ పత్తి విత్తనాల వల్ల నష్టపోయిన పత్తి పంటలను పరిశీలించారు. చెట్టుకు ఎన్ని కాయలు దిగుబడి రావాలి, ప్రస్తుతం దిగుబడి ఎంత వచ్చింది అని పరిశీలించారు. పత్తి చెట్టుకు పూర్తిగా కాయలు లేకపోవడంతో నకిలీ విత్తనాలుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధికారులకు విన్నవించారు. ప్రతి రైతుకు ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని రైతుసంఘం నాయకులు డిమాండ్ చేశారు.