తండ్రీకూతుళ్ల బంధం మాటల్లో చెప్పలేం. కూతుళ్ల సంతోషం కోసం తండ్రులు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తాజాగా అలాంటి తండ్రీ కూతుళ్ల బంధానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక చిన్న అమ్మాయి తన తండ్రికి స్విగ్గీలో కొత్త ఉద్యోగం వచ్చినప్పుడు ఆమె పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.. ఆమె ఆనందంతో ఎగిరి గంతేస్తూ తండ్రిని కౌగిలించుకున్న తీరు నెటిజన్లను సైతం ఆనందంతో కన్నీళ్లు పెట్టిస్తుంది.