తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా చోళవరం గ్రామానికి చెందిన ఆముద, భార్య భర్తలు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆముదకు అదే గ్రామానికి చెందిన జగదీష్ తో వివాహేతర సంబంధం ఏర్పడి అతనితో వెళ్లిపోయింది. ఆముద తల్లితండ్రులు వెతికి పట్టుకొని భర్తతో కలిపారు. ఆముద మళ్లీ జగదీష్ తో వెళ్లిపోయింది. తిరువళ్లూరు మున్సిపాలిటి పరిధిలో ఆమె అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.