రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న సేవలను, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఏ డి ఏ సిహెచ్ తిరుమల దేవి కోరారు. పొన్నూరు మండల పరిధిలోని ఉప్పరపాలెం, మునిపల్లె, పెద్దపాలెం, దుప్పలపొడి, మన్నవ, సీతారామపురం గ్రామాల్లో ఆమె పర్యటించారు. పంట నమోదు ఈకేవైసీ కి సంబంధించిన రికార్డులను ఆమె పరిశీలించారు. రైతులు వ్యవసాయ శాఖ సేవలు పొందాలంటే తప్పనిసరిగా పంట నమోదు ఈకేవైసీ చేయించుకోవాల్సిందేనన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అందిస్తున్నామన్నారు. రైతుల ముంగిటకు సేవలు అందించడమే ధ్యేయంగా ఆర్బికేలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ డి ఏ వెంట మండల వ్యవసాయ అధికారి డేగల వెంకటరామయ్య, ఆయా గ్రామాల అగ్రికల్చర్ అసిస్టెంట్ పాల్గొన్నారు.