శబరిమల వెళ్లే భక్తుల కోసం రెండు ప్యాకేజీలు సిద్ధం చేసినట్లు ప్రజారవాణా శాఖాధికారి ఎ. విజయ కుమార్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. దీనికి సంబంధించి శుక్రవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్పస్వామి భక్తులకు స్వామి వారిని సందర్శించుకునే అవకాశాన్ని ఆర్టీసీ భక్తులకు కల్పించిందన్నారు. శ్రీకాకుళం 1, శ్రీకాకుళం 2, టెక్కలి, , పలాస డిపోల నుంచి శబరిమల కు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయన్నారు. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. శబరిమలై వెళ్ళే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
స్వాములకు కావాల్సిన విధంగా బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. శబరిమలైకు రెండు ప్యాకేజీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏడు రోజులు మరియు 11 రోజుల్లో శబరిమలై వెళ్లి తిరిగి వచ్చే విధంగా ప్యాకేజీ ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.