టిడిపి నాయకులు కేసినేని శివనాద్ ఆధ్వర్యంలో విజయవాడ సెంటర్ నియోజకవర్గంలో మొబైల్ అన్న క్యాంటీన్ సేవలు ప్రారంభించారు. ఈ సేవలు పేద ప్రజల ఆకలిని తీరుస్తున్నాయి అని బోండా ఉమా తెలియజేసారు. ప్రజల ఆకలి తీర్చాలన్న కేశినేని చిన్ని గారి లక్ష్యం నెరవేరడం సంతోషకరం. చంద్రబాబు గారు తెచ్చిన అన్నా క్యాంటీన్ సేవలను జగన్ రెడ్డి దూరం చేసినా.. టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తూ పేదల కడుపు నింపుతున్నారు అని తెలియజేసారు.