గడప గడపలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైయస్ఆర్‌సీపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం పెంట సచివాలయం పెంట గ్రామంలో గడపగడపకు-మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 93వ రోజు ఉదయం 7:30గంటల నుంచి 11:30గంటల వరకు 316 గడపల ప్రజలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ నేరుగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ ..అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించడమే తమ లక్ష్యమని, మూడేళ్లలో గడప గడపకు సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు ఆయా పథకాలతో మూడేళ్లుగా కలిగిన లబ్ధిని ప్రజలకు తెలియజేశారు. స్థానికంగా సమస్యలను ప్రజలతోనే అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఏ గడపకు వెళ్లినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా అనంత తెలిపారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పేద,బడుగు,బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ప్రజల ఆశీస్సులు తమ ప్రభుత్వానికి ఉన్నాయని,ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమం,అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.అనంతరం సచివాలయ సిబ్బంది,వాలంటీర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.ఏ ఒక్క అర్హుడికి పథకాలు రాకుండా ఉండే పరిస్థితి ఉండకూడదన్నారు.