వంగవీటి రంగా హత్యకు కారణమైన చంద్రబాబును విజయవాడలోని హోటల్ లో కలిసి, ఆయన పక్కన చేతులు కట్టుకుని నిలబడి పవన్ కల్యాణ్ కాపుల పరువును తీశాడని తాడేపల్లిల్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అడపా శేషు ధ్వజమెత్తారు. గతంలో కూడా జనవాణి కార్యక్రమానికి విజయవాడ వచ్చి, కనీసం రంగా విగ్రహానికి దండ వేయని పవన్ కల్యాణ్ కు కాపుల పట్ల ఏం ప్రేమ ఉందని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి కావాలని జనసైనికులు ఆయన చుట్టూ వీరావేశంతో తిరుగుతుంటే.. అతను మాత్రం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలనే విధంగా వ్యవహరించడాన్ని కాపు యువత గుర్తించాలన్నారు.