సీఎం జగన్ ఆదేశాల మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా జూన్ కల్లా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతంలో చేపట్టే పనుల ప్రణాళికపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు.