సీఎం జగన్ తో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు భేటీ అయ్యారు. పరిపాలన రాజధానిగా విశాఖ సాధన కోసం రాజీనామా చేస్తానని, రాజధాని ఉద్యమం చురుగ్గా, చైతన్యవంతంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, ఉత్తరాంధ్ర ప్రజల అభిలాషను నెరవేర్చడం కంటే మంత్రి పదవి గొప్పది కాదని, రాజీనామాకు అనుమతించాలని ముఖ్యమంత్రిని వైయస్ జగన్‌ను మంత్రి ధర్మాన కోరారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మానను సీఎం వారించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు పంచుతూ వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి ప్రభుత్వ విధానమని సీఎం వైయస్ జగన్ వివరించారు. మూడు ప్రాంతాలకు సమన్యాయమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.