కరోనా అనంతరం దిగ్గజ కంపెనీలు సైతం నష్టాలను చవిచూస్తున్నాయి. ఇక చిన్న..చితక కంపెనీలు ఏకంగా మూతపడ్డాయి. ఇదిలావుంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఉపకరణాల దిగ్గజం 'ఫిలిప్స్' భారీ సంఖ్యలో ఉద్యోగులను సాగనపేందుకు సిద్ధమవుతోంది. 4 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు 'ఫిలిప్స్' నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగుల్లో చురుకుదనాన్ని పెంచి, ఉత్పాదకతను ఇనుమడింపజేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని 'ఫిలిప్స్' సీఈవో రాయ్ జాకబ్స్ తెలిపారు. కంపెనీ మూడో త్రైమాసికం ఫలితాలను వెల్లడిస్తూ ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. మూడో త్రైమాసికంలో నిర్వహణ, సరఫరా రంగ సవాళ్లు ఫిలిప్స్ వాణిజ్యంపై ప్రభావం చూపాయని వివరించారు. ఈ నేపథ్యంలో, బాధగాన ఉన్నా, ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకోక తప్పలేదని రాయ్ జాకబ్స్ విచారం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా 'ఫిలిప్స్' ను మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇవి ప్రారంభ చర్యలు అని భావిస్తున్నామని తెలిపారు. అయితే ఈ తొలగింపుతో ప్రభావితమయ్యే ఉద్యోగుల భవితవ్యాన్ని తాము తేలిగ్గా తీసుకోవడంలేదని, వారికి ఊరట కలిగించే విధంగా విధివిధానాలు అమలు చేస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa