అనంతపురం జిల్లా తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు దీపావళి పర్వదినాన్ని వినూత్నంగా జరిపారు. కస్తూరిబా బాలికల పాఠశాల ( Orphans, Semi Orphans ) విద్యార్థులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప IPS గారి ఆదేశాల మేరకు తాడిపత్రి డీఎస్పీ V. N. K చైతన్య, పామిడి రూరల్ సి.ఐ B రామ కృష్ణ, యాడికి ఎస్సై P వెంకటేశ్వర్లు, యాడికి PS సిబ్బంది ఈరోజు యాడికి మండలం వేములపాడు కస్తూరిబా బాలికల పాఠశాలకు వెళ్లారు. స్వీట్స్, టపాసులు అందజేసి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారి మధ్యే పండుగ సంబరాలు జరిపి విద్యార్థులతో కలసి సహ పంక్తి భోజనం చేశారు. పోలీసులను కుటుంబ సభ్యులుగా భావించి ఎలాంటి ఇబ్బంది/సమస్య తలెత్తినా తమ సహకారం తీసుకోవాలని కోరారు. పోలీసుశాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్గించారు.