పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలోని పాములూరు గ్రామ పంచాయతీలో బుధవారం గ్రామదర్శిని అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులు మరియు మండల స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామాన్ని సందర్శించారు. విద్యాశాఖ అధికారులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాములూరును సందర్శించి విద్యార్థులతో కలిసి ప్రేయర్ లో పాల్గొనడం జరిగింది.
ఇందులో జిల్లా విద్యాశాఖ అధికారి చెప్పలి దేవరాజు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక ఉన్నత లక్ష్యం తోటి ఉన్నత ఆశయం తోటి చదవాలని క్రమశిక్షణగా మెలగాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు. జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డా. అంబవరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆటలు పాటలు మాటలలో మంచి నైపుణ్యం సంపాదించి ఈ సమాజంలో ప్రతి విద్యార్థికి గౌరవం ఉండాలన్న తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల విద్యాశాఖ అధికారి వీరారెడ్డి డిప్యూటీ విద్యాశాఖ అధికారి నాగరాజు , ప్రధానోపాధ్యాయులు శివరామ్ తదితరులు పాల్గొన్నారు.