హౌసింగ్ పై తెలుగుదేశం పార్టీ పోరు బాట పట్టనున్నట్లు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చెప్పారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద వారికి ఇళ్ళు ఇవ్వడంలో సీఎం జగన్ కి చిత్త శుద్ధి లేదన్నారు. పేదలు అంటే కనికరం లేని ప్రభుత్వం ఇదని తూర్పు నియోజక వర్గంలో 3210 ఇళ్ళు ఇచ్చినట్టు టీడీకో రిపోర్ట్ లో చూపించారని అయితే ఇప్పుడు 120 ఇల్లు చూపిస్తున్నారని విశాఖలో విలువైన భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
విశాఖ ఈస్ట్ లో లబ్ధిదారులకు 50 కిలోమీటర్లు దూరంలో రెడ్డిపల్లిలో స్థలాలు ఇస్తున్నారని పేదలకు విలువైన భూములు ఇవ్వకుండా కొట్టేసే ఆలోచన లో ఉన్నారని ఒక్క విశాఖలో ప్రభుత్వ పధకాలకు భూములు కోనే అనుమతి ఇవ్వలేదన్నారు. 225 చదరపు అడుగుల విస్తీర్ణంలో జగనన్న ఇల్లు కడుతున్నా రని వాటిలో నివాసం ఎలా ఉండగలరని ప్రశ్నించారు. కనీసం నిద్ర పోవడానికి ఒక మంచం కూడా వేసుకు నే అవకాశం లేని ఇల్లు ఇస్తారా అన్నారు. ఈ నెల 28 నుంచి ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు మీద పోరాటం చేస్తామని నవంబర్ రెండో వారం వరకు వేచి చూస్తాం.
ఈ జివిఎంసి అధికారు లు పేదల ఇళ్ల విషయంలో నిర్ణయం తీసుకోకపోతే జివిఎంసి ప్రధాన కార్యాలయం ముందు నిరసన చేస్తామన్నారు. టీడీపీ విశాఖ పార్లిమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ హయం లో పట్టణ ప్రాం తంలో 70 వేలు పట్టాలు ఇచ్చామని వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టాలను ప్రక్కన పెట్టారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ , ఇల్లు నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేదని ఇచ్చిన పట్టాలకు తక్షణమే రిజి స్ట్రేషన్ హక్కు కలిపించి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పోతన్నరెడ్డి, ఆళ్ళ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.