ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఇంకా నైరుతి బంగాళాఖాతం నుంచి దక్షిణ కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో దక్షిణాదిపైకి ఈశాన్య గాలులు వీయనున్నాయి. వీటి ప్రభావంతో ఈనెల 29న ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా దేశం నుంచి నైరుతి రుతుపవనా లు నిష్క్రమించిన వెంటనే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాలి. ఈ నెల 23న నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి.