టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై జింబాబ్వే సాధించిన విజయం పెను సంచలనంగా మారింది. ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికీ దారి తీసింది. జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో ఎంనంగగ్వా చేసిన కామెంట్స్ పట్ల పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. తమ వద్ద క్రికెటింగ్ స్పిరిట్ ఉందంటూ ఎదురుదాడికి దిగారు. జింబాబ్వే అధ్యక్షుడికి బదులిచ్చారు. ఈ పరిణామం- రెండు దేశాల క్రికెట్ అభిమానులను మరింత రెచ్చగొట్టినట్టయింది. పరస్పరం కౌంటర్ అటాక్ చేసుకుంటోన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa