దీపావళి సందర్భంగా రద్దీగా ఉండే రోడ్డుపై రన్నింగ్ కారుపై పోకిరీలు టపాసులు పేల్చారు. వేగంగా కారును నడుపుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. హర్యానాలోని గురుగ్రాం డీఎల్‌ఎఫ్ 5 రోడ్డుపై జరిగిందీ ఘటన. ఆ దృశ్యాలను కొందరు కెమెరాల్లో బంధించి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. పోకిరీలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ వ్యవహారాన్ని గురుగ్రాం పోలీసులు సీరియస్‌గా తీసుకుని.. వారిని పట్టుకునే పనిలో పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa