ఇటీవల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ వాడికి ఉరిశిక్షే సరైనది అని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని డీఏవీ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వాడిని కఠినంగా శిక్షించాలని... వాడికి ఉరిశిక్షే సరైనదని ఆయన అన్నారు. ఈ ఘటనలో నిందితుడికి శిక్ష విధించే క్రమంలో అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఏపీలో శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని కితాబునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa