కార్యకర్తలను కాపాడుకోవడంలో ముందుంటున్న టీడీపీ తాజాగా మరో వితరణ చేపట్టింది. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ టీడీపీ నేత కుమార్తెకు ఆపరేషన్ కు అవసరమైన రూ.15 లక్షలను ఆ పార్టీ అగ్ర నేత నారా లోకేశ్ అందజేశారు. ఈ మేరకు శుక్రవారం రూ.15 లక్షల చెక్కును బాలిక తండ్రి గాజుల మురళీకృష్ణకు ఆయన అందజేశారు. ఈ మొత్తాన్ని టీడీపీ ఎన్నారై అమెరికా విభాగం సేకరించింది. ఆ మొత్తాన్నే నారా లోకేశ్ బాధిత కుటుంబానికి అందజేశారు.
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ నేత మురళీకృష్ణ కుమార్తె గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వైద్యులకు చూపించగా...బాలికకు ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎన్నారై అమెరికా విభాగానికి చెందిన కీలక నేత కోమటి జయరామ్ నిధుల సేకరణకు పూనుకున్నారు. టీడీపీ ఎన్నారై అమెరికా విభాగానికి చెందిన సభ్యుల సహకారంతో బాలిక ఆపరేషన్ కు అవసరమైన రూ.15 లక్షలను ఆయన సేకరించారు. ఈ నిధులను నారా లోకేశ్ ద్వారా టీడీపీ ఎన్నారై అమెరికా విభాగం బాధిత బాలికకు అందజేసింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో టీడీపీ ఎన్నారై అమెరికా విభాగం ముందుంటుందని లోకేశ్ అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa