అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రోకెన్ యూరో పట్టణంలోని ఓ ఇంట్లో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో ఆరుగురు చిన్నారులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. గురువారం ఓ వ్యక్తి కారులో అటుగా వెళ్తూ ఇంట్లో నుంచి మంటలు రావడం చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అది అగ్ని ప్రమాదంగా లేదని అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa